శ్రీముఖి.. ఈ పేరు కొద్ది రోజుల వరకు కొంత వరకే పరిమితమైంది. కాని బిగ్ బాస్ షోలో ఈ అమ్మడు కంటెస్టెంట్‌గా ఎప్పుడైతే అడుగుపెట్టడంతో అప్పటి నుండి శ్రీముఖి పేరు తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగిపోయింది. లౌడ్ స్పీకర్ బిరుదు అందుకున్న శ్రీముఖి సీజన్ పూర్తైన తర్వాత ఏ షో చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తు వచ్చారు. తాజాగా స్టార్ యాజమాన్యం శ్రీముఖి షోకి సంబంధించి చిన్న ప్రోమో విడుదల చేశారు. ఇందులో శ్రీముఖి పాట పాడుతూ, స్టెప్పులు వేస్తూ అలరించింది. స్టార్ మా మ్యూజిక్ రీలోడెడ్ అనే కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి ఆడిపాడింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కాగా, షో కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టక ముందు శ్రీముఖి పటాస్ షోతో పాటు పలు కార్యక్రమాలలో దుమ్మురేపిన సంగతి తెలిసిందే.
సింగర్ అవతారమెత్తిన శ్రీముఖి..!