ఇరాన్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతున్నది. వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో రోజురోజుకు మృతుల సంఖ్య పెరిగిపోతున్నది. ఇరాన్ ప్రభుత్వం దేశంలో ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట పడటంలేదు. గత 24 గంటల్లోనే ఇరాన్‌లో 123 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 15,556కు చేరింది.
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఇరాన్‌లో భారీగానే పెరుగుతన్నది. రోజూ కొన్ని వందల మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో 966 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందంటే అక్కడ వైరస్ ఎంత బీభత్సం సృష్టిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. తాజా కేసులతో కలిపి ఇరాన్‌లో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 20,610కి చేరింది.