తెలంగాణలో మరో మహిళకు కరోనా.. 21కి చేరిన కేసుల సంఖ్య

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌ను నిర్మూలించేందకు అన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ చాప కింద నీరులా కేసుల సంఖ్య మాత్రం నిదానంగా పెరుగుతూనే ఉన్నది. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది.


కేపీహెచ్‌బీ కాలనీలోని ఫేజ్‌-2కు చెందిన ఓ మహిళకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కరోనా సోకిన మహిళతోపాటు ఆ ఇంట్లో ఉన్న మరో ఇద్దరికి కూడా కరోనా ఉందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, సదరు మహిళ సోదరుడు ఇటీవలే యూకే నుంచి వచ్చినట్లు తెలిసింది.